రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్

47
- Advertisement -

యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబందు పంట పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయుటకు ఎన్నికల కమిషన్ ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి యేటా వానాకాలం సీజన్ మరియు యాసంగి సీజన్ ప్రారంభం అయిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంగా రైతుబందు నిధులను విడుదల చేస్తున్నది.

అదే విధంగా ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబందు ను గతంలో వలె తక్కువ భూ విస్తీర్ణం వున్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 25, 26 ,27 తేదీల్లో బ్యాంకు హాలిడేస్ వున్నవి. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీ కి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని తెలిపింది.

తదనుగుణంగా రైతు బంధు పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలలో DBT పద్ధతిలో నేరుగా జమజేయుటకు నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపింది. రైతు బంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.

Also Read:Raviteja:ఈగల్ షూటింగ్ పూర్తి

- Advertisement -