పెరుగులో చక్కెర కలిపి తింటున్నారా.. జాగ్రత్త!

42
- Advertisement -

చాలామందికి పెరుగులో చక్కెర కలుపుకొని తినే అలవాటు ఉంటుంది. ఎక్కువగా వేసవి కాలంలో ఈ విధంగా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల శరానికి ఎంతో మేలు కలుగుతుందని నమ్ముతారు. ఇలా తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని, చలువ చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఉదయాన్నే పెరుగు చక్కెర కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. పెరుగు చక్కెర కలిపి తినడం వల్ల రోగనిరోదక శక్తి పెరుగుతుంది..

అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయట. ఇక సన్నగా ఉన్నవాళ్ళు పెరుగు చక్కెర కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తింటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉందట. అయితే ఇలా తినడం వల్ల ఆరోగ్యప్రయోజనలతో పాటు పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగు చక్కెర కలిపి తింటే దంతక్షయం ఏర్పడి దంతాలు త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంది. పెరుగులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. అలాగే చక్కెరలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా తినడాన్ని మనుకోవాలి. ఎందుకంటే పెరుగులో చక్కెర కలవడం వల్ల డయబెటిస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.. అంతే కాకుండా ఇలా తినడం వల్ల గట్ మైక్రోబయోమ్ లో అసమతుల్యత ఏర్పడి.. జీర్ణ ప్రక్రియకు ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉంది. ఇలా తినడం వల్ల డయేరియా కూడా అటాక్ అవకాశాలు ఎక్కువగా, కొంతమందికి వాంతులు విరోచనలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల పెరుగు చక్కెర కలిపి తినే అలవాటు ఉన్నవాళ్ళు చాలా వరకు మానుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ పెరుగును తినడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -