కేసీఆర్‌కు దావోస్ ఆహ్వానం…

215
Ease of Doing Business
- Advertisement -

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఇఓడిబి)లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలవడం పట్ల వరల్డ్ ఎకనమిక్ పోరమ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ పోరమ్ వ్యవస్థాపకుడు & కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్ శ్వాట్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు అభినందన లేఖ రాశారు. వరల్డ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ(డిఐపిపి) ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రం ఇఓడిబి సంస్కరణల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధారణ నాయకత్వానికి, రాష్ట్రం పట్ల ఆయనకున్న దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యమని ఆ సందేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడం. ప్రత్యేకంగా డిజిటల్‌, ఇంటర్నెట్ విభాగాల్లో కలిసి నడవడం తమకు గర్వంగా ఉందని ప్రకటించారు.

Ease of Doing Business

2017 జనవరిలో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ పోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనాలని కూడా కేసీఆర్ ను శ్వాట్ ఆహ్వానించారు.

- Advertisement -