- Advertisement -
న్యూజిలాండ్‌ను భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో మంగళవారం ఉదయం భూమి కంపించగా భూకంపం తీవ్రత 6.5 నుంచి 6.8 మధ్య ఉండే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు న్యూజిలాండ్ అధికారులు తెలిపారు. న్యూజిలాండ్ పశ్చిమ నైరుతి తీర ప్రాంత పట్టణం రివర్టన్ సమీపంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం తీవ్రత భారీ స్థాయిలోనే ఉండటంతో నష్టం సంభవించి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఈ ప్రాంతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదు. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Also Read:థ్రిల్లింగ్ మ్యాచ్..ఢిల్లీ సంచలన విజయం
- Advertisement -