తెలుగు సినిమాలు ప్రపంచమంతటా మారుమోగుతుంటే బాలీవుడ్లో మాత్రం సినీ రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా కండలవీరుడు చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రకమైన చర్చకు తీసుకురాగా తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు సంబంధించిన ఒక పాత వీడియో వైరలవుతోంది. ఈ వీడియోపై బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. దీనిపై తాజాగా క్వీన్ కంగనారనౌత్ కూడా ఘాటుగా స్పందించారు.
అయితే ఆ వీడియోలో కరణ్ అనుష్కశర్మను ఉద్దేశిస్తూ మాట్లాడారు. అనుష్కకు అవకాశాలు రాకుండా చేయాలని తాను ప్రయత్నించినట్టు చెప్పారు. అలాగే రబ్నే బనాది జోడి సినిమాలో అనుష్కను తప్పించాడానికి చాలా ప్రయత్నాలు చేసినట్టుగా ఒప్పుకున్నారు. అంతేకాదు . అదిత్య చోప్రాను కూడా ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ ఆమె నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత ప్రతిభ ఉన్న అమ్మాయిని నేను తీసుకోవద్దని చెప్పా..అని నాకు చాలా గిల్టీగా ఫీలయ్యాను. వెంటనే అనుష్కకు ఫోన్ చేసి మెచ్చుకున్నా అని అన్నారు.
ఈ వీడియోను షేర్ చేస్తూ కంగనా..ఈ పెద్ద మనిషికి ఇదే పని. అందరి కెరీర్లు నాశనం చేయడమే ఆయనకు ఉన్న ఏకైక పని అంటూ వ్యంగ్యంగా మట్లాడారు. అంతేకాదు వివేక్ అగ్నిహోత్రి కూడా స్పందించారు. తన ట్విట్టర్లో వీడియో షేర్ చేస్తూ..కొందరికీ ఇలా చేయడం అలవాటుగా మారిపోయింది. ఎంతో టాలెంట్ ఉన్ వారిని ఇండస్ట్రీకి రానివ్వకుండా ఇలా రాజకీయాలు చేయడం వల్లే బాలీవుడ్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి…