‘శాన్వీ క్రియేషన్స్, అమృత సాయి ఆర్ట్స్ సంయుక్తంగా భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య తదితరులు నటించిన జోరర్ (దైవాంశిక) తెలుగు చిత్రం ‘ద్యావుడా..’. సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి.జి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించగా..లోగోను హ్యాపీడేస్, వంగవీటి ఫేమ్ వంశీ ఆవిష్కరించారు. హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘నాటుకోడి’ చిత్ర నిర్మాత బందరు బాబీ లతో పాటు, చిత్ర హీరోలు భాను, శరత్, జై లు, హీరోయిన్స్ అనూష, హరిణిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత హరికుమార్ రెడ్డి.జి మాట్లాడుతూ..’నూతన సంవత్సరం మొదటి రోజున మా చిత్ర టీజర్ ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కాన్సెఫ్ట్ నచ్చి అనుకున్న విధంగా తెరకెక్కించినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం దైవాంశిక పరమైన అంశంతో ముడిపడి ఉంటుంది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి…త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాం అన్నారు.
చిత్ర దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ..ఇది విభిన్న కథా చిత్రం. ఇండియాలోని కొన్ని దేవాలయాల్లోని సంఘటనలను తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. నటీనటులు కొత్తవారైనా..చాలా బాగా చేశారు. నిర్మాత హరికుమార్ రెడ్డి..నన్ను నమ్మి..ఈ చిత్రాన్ని నిర్మించినందుకు ఆయనకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి…అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్; కెమెరామెన్: తరణ్. కె, సోను. కె; నిర్మాత: హరికుమార్ రెడ్డి.జి; కథ స్క్రీన్‌ప్లే; దర్శకత్వం: సాయిరామ్ దాసరి.