ప్రగతి భవన్‌లో కొత్త సంవత్సర వేడుకలు…..

205
NEW YEAR CELEBRATIONS KCR
- Advertisement -

ప్రగతి భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశలో 2016 సంవత్సరంలో బలమైన పునాదులు పడ్డాయని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఒరవడిలో 2017 సంవత్సరం సాగేలా చూడాలని సిఎం భగవంతుడిని వేడుకున్నారు. ప్రజలంతా ఆనందం, ఉత్సాహంతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సిఎం పిలుపునిచ్చారు.

NEW YEAR CELEBRATIONS

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెలువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు ప్రముఖులు, ప్రజలతో ప్రగతి భవన్ సందడిగా మారింది. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సి. విఠల్, బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు, టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్లు, నగర డిప్యూటీ మేయర్, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, పుర ప్రముఖులు, ఎన్నారై ప్రముఖులు, సీఎంవో అధికారులు, నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, సింగరేణి సీఎండీ, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు మైనార్టీ నేతలు, సినిమా పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, టీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.

అదే విధంగా తెలంగాణ భవన్‌లో కూడా కొత్త సంవత్సర వేడుకలు సందడిగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె కేక్‌ కట్‌ చేశారు. ఈవేడుకల్లో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు… తెలంగాణ భవన్‌కు విచ్చేసి సందడి చేసి….కవితకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కవిత మాట్లాడుతూ…..నూతన సంవత్సరంలో తెలంగాణ సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.

https://youtu.be/A0LkxbuP1ng?t=14

- Advertisement -