నాంపల్లిలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేటీఆర్…..

360
KTR
- Advertisement -

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది అని కేటీఆర్ అన్నారు. మన ఉత్పత్తులను మనమే ప్రదర్శించుకోవాలన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చెప్పారు. నుమాయిష్ కు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 46 రోజుల పాటు కొనసాగే నుమాయిష్ లో రూ. 100 కోట్ల బిజినెస్ జరుగుతుందన్నారు. 2,500 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంను మంత్రులిద్దరూ కలిసి ప్రారంభించారు.

hyderabad numaish

ఈసారి ఆదాయం పెంచుకోవడంలో భాగంగా ఎగ్జిబిషన్‌ ఎంట్రీ టికెట్‌ ధరను 20 నుంచి 25 రూపాయలకు పెంచారు. ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలకు మాత్రం ఉచిత ఎంట్రీ కల్పిస్తారు. ఎగ్జిబిషన్‌కు లక్షలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటుచేసింది.

- Advertisement -