- Advertisement -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో. టీ-20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్‌లో ఎన్నో హెచ్చుతగ్గులు చూశానని, ఇక రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కాస్త బావోద్వేగానికి లోనయ్యాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా దేశవాలీ టోర్నమెంట్‌లలో ఆడనున్నాడు బ్రావో.
మరో స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ సైతం రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. టీ-20 వరల్డ్ కప్‌లో గేల్ దారుణంగా విఫలమయ్యాడు. టీ 20 వరల్డ్ కప్‌కు ముందు జరిగిన సిరీస్‌లలోనూ గేల్ పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో గేల్ రిటర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతోంది.
- Advertisement -