దుబ్బాక నేటి నుండి నామినేషన్ల స్వీకరణ..

191
dubbaka by polls
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల నామినేషన్లను నేటి నుంచి స్వీకరించనున్నారు. ఈ మేరకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా నేటి నుండి 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో నామినేషన్లు వేసేందుకు అవకాశముండదు. 17న నామినేషన్ల పరిశీలన ఉండగా 19 వరకు ఉపసంహరణ గడువు విధించారు. నవంబర్‌ 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

తొలిసారి ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్ కల్పించారు. గతంలో నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు నలుగురికి అనుమతి ఉండేది కానీ ఈసారి కొవిడ్ నిబంధనల కారణంగా ఇద్దరికీ మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే నాయకుల రాకపోకలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. పార్టీల ప్రచారాన్ని పరిశీలిస్తున్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు సభలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -