రాష్ట్రంలో 24 గంటల్లో 1891 కరోనా కేసులు..

91
telangana coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1891 కరోనా కేసులు నమోదుకాగా 7 గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,08,535కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 26,374 యాక్టివ్ కేసులుండగా 1,80,953 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1208 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.57 శాతంగా ఉంది. ఇక కరోనా రికవరీ రేటు భారత్‌లో 85.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో 86.77 శాతంగా ఉంది.