దేశంలో 69 లక్షలు దాటిన కరోనా కేసులు..

178
india coronacases

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు 70 వేలకు పైగా కేసులు న‌మోదు కానుండటంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 69 ల‌క్ష‌ల మార్కును దాటాయి.

గ‌త 24 గంట‌ల్లో 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 964 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 69,06,152 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 8,93,592 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

59,06,070 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 1,06,490 మంది మృతిచెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.