భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నికకావడం సంతోషంగా ఉందన్నారు.పేదలు కూడా తమ కలల్ని నిజం చేసుకోవచ్చు అని తనతో రుజువైందన్నారు. మీ నమ్మకం, మద్దతు బాధ్యతల్ని నిర్వర్తించేందుకు తనకు శక్తినిస్తుందన్నారు.
రాష్ట్రపతి పోస్టును చేరుకోవడం తన వ్యక్తిగత ఘనతగా భావించడం లేదని, ఇది భారత్‌లో ఉన్న ప్రతి పేదవాడి అచీవ్‌మెంట్ అని, తాను రాష్ట్రపతిగా నామినేట్ అవ్వడం అంటే, దేశంలో పేదలు కలలు కనవచ్చు అని, వాళ్లు ఆ కలల్ని నిజం చేసుకోవచ్చు అని రుజువైందన్నారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేస్తానన్నారు. దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు.