- Advertisement -
డ్రగ్ టెస్టు చేయించుకున్నారు ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్. రీసెంట్‌గా ఓ పార్టీలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ప్రధానిపై ఆరోపణలు చేయగా ఆమె డ్రగ్ టెస్టు చేయించుకున్నారు.
తానేమీ డ్రగ్స్ తీసుకోలేదని ఫిన్‌ల్యాండ్ ప్రధాని తెలిపారు. 2019 డిసెంబర్‌లో ప్రపంచంలోనే యువ ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే పార్టీ వీడియోలు లీక్ కావడంతో.. కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్షాలు పార్టీలు డ్రగ్ టెస్టుకు డిమాండ్ చేశాయి.
- Advertisement -