‘దృశ్యం 2’ విడుదలపై నిర్మాత క్లారిటీ..

30
Drishyam 2 Telugu

హీరో వెంకటేష్‌ ప్రధాన పాత్రలో ‘దృశ్యం 2 చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతోంది. ఈమూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు నెలలలోపే ఈ సినిమా షూటింగును పూర్తి చేయడం విశేషం. మొదటిభాగంలో తెరపై కనిపించిన ఆర్టిస్టులు అంతా కూడా రెండవ భాగంలోను ఉన్నారు. సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే ఈ మూవీ రిలీజ్‌పై పుకార్లు షికారు చేస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితి లేదు కనుక, ఈ సినిమాను ఓటీటీలో రీలీజ్ చేయనున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో సురేశ్ బాబు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తాము స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.