టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా జవహర్ రెడ్డి ప్రమాణం..

147
jawahar reddy
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ఈఓ జవహర్‌రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయ బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగగా అదనపు ఈఓ ధర్మారెడ్డి సైతం కన్వీనర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ నెల 21న టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్‌ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం.. ప్రభుత్వం ఈఓ, అదనపు ఈవోలతో అథారిటీని ఏర్పాటు చేసింది. అథారిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధర్మకర్తల మండలి నిర్వహించే అన్ని విధులను నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -