60.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు..

33
minister

ఇప్పటివరకు 60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్లు జమ చేశామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గురువారం 18 వేల మంది రైతుల ఖాతాలలో 2.40 లక్షల ఎకరాలకు గాను రూ.120.16 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

మొత్తం ఇప్పటి వరకు 145.98 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందిందని వెల్లడించారు. మొత్తం ఈ విడతలో 63 లక్షల 25 వేల 695 మంది రైతులకు రూ.7508.78 కోట్లు అవసరం కాగా ఇప్పటివరకు 60.75 లక్షల మంది రైతులకు రూ.7298.83 కోట్లు ఖాతాలలో జమ చేసినట్లు వెల్లడించారు నిరంజన్ రెడ్డి.