పేదవారి సొంతిటి కల నెరవేరుస్తాం…

204
Double bedroom is self-respect of people
- Advertisement -

హైదరాబాద్ లోని పేదల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కృషిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ బన్సీలాల్ పేట జీవైఆర్‌ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన కేటీఆర్ .. పేద వారు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా కేసీఆర్ ముందుచూపుతో సంక్షేమపథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు.డబుల్ బెడ్ రూం పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకని స్పష్టం చేశారు.

Double bedroom is self-respect of people

గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ ఉండేది కాదని కానీ స్వరాష్ట్రంలో ఆ పరిస్ధితి మారిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు నిర్మించి తీరుతామని చెప్పారు.బస్తీలలో బీదల కష్టాలు ఏంటో నాకు తెలుసన్నారు. పేద విద్యార్థుల చదువుకోసం 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వంలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కళ్యాణ లక్ష్మీతో పేదింటి ఆడవారి పెళ్లికి ప్రభుత్వం రూ.75 వేల ఇస్తున్నామని చెప్పారు. ఆటోడ్రైవర్లకు రూ. 5లక్షల ప్రమాద బీమా కల్పించామని…అందరి సంక్షేమం ప్రభుత్వ బాధ్యతని వెల్లడించారు.కేసీఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమని స్పష్టం చేశారు. జూన్ 2 నుంచి కేసీఆర్ కిట్ పంపిణి చేస్తామని చెప్పారు. రాష్ట్ర గవర్నర్ సైతం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని మెచ్చుకున్నారని తెలిపారు. నగరంలో ఒక లక్ష ఇళ్లు కడితే సరిపోవని రానున్న కాలంలో మరిన్ని ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -