సభ్యసమాజానికి మెసేజ్ ఇచ్చిన బన్నీ

208
Allu Arjun's Duvvada Jagannadham release date
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. తొలుత ఈ సినిమాను మేలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ అనివార్య కారణాల విడుదల తేదీ ఆలస్యమవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే, తాజాగా బన్నీ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశాడు.ఈ సినిమాను జూన్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా, రిలీజ్ డేట్ ను యాడ్ చేసిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ‘సరైనోడు’ తరువాత బన్నీ చేస్తోన్న సినిమా కావడం వలన .. బ్రాహ్మణ యువకుడి లుక్ తో బన్నీ కనిపించనుండటం వలన .. చాలా గ్యాప్ తరువాత పూజా హెగ్డే చేస్తోన్న సినిమా కావడం వలన .. అందరిలోనూ ఆసక్తి నెలకొంది . ‘సభ్య సమాజానికి మెసేజ్ : డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా జూన్ 23న రిలీజ్ అవుతుంది’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

డీజే ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన బన్నీ టీజర్ తోనూ అదే హవా కంటిన్యూ చేసింది.  కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటి బన్నీ కెరీర్ లో సరి కొత్త రికార్డ్ సృష్టించింది.

- Advertisement -