టీజర్‌ తో భయపెడుతున్న నయన్‌..!

286
Dora - Official Tamil Teaser
- Advertisement -

హార్రర్ కమ్ హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలతో తమిళం, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నయనతార. ఇప్పుడు ఇదే తరహా చిత్రాల్లో నటించేందుకు ఈ భామ తెగ ఆసక్తి చూపుతోంది. ‘మాయ’వంటి హార్రర్ కమ్ హీరోయిన్ ఒరియంటెడ్ సినిమాలో నయన్‌ నటించిన విషయం తెలిసిందే. అయితే నయనతార తాజాగా నటిస్తున్న సినిమా ‘డోరా’ ఇది కూడా హార్రర్ కమ్ హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రమే.

ఈ సినిమా హీరో లేకుండానే తెరకెక్కుతోంది. మర్డర్‌ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే హర్రర్‌ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో ‘డోరా’ రెడీ అవుతోంది. అయితే కోలీవుడ్‌లో నయన్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ఈ అమ్మడి ఫాలోయింగ్‌ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ అమ్మడు కనిపిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేంతగా తమిళ ప్రేక్షకులు నయన్‌ కి కనెక్టయిపోయారు. ఇటు గ్లామర్‌తోనూ అటు నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ భామ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కుమ్మేస్తోంది.

ఇక నయన్ లేటెస్ట్ సినిమా డోరాతో మరింత పాపులరైపోయింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన నయన్ తాజాగా టీజర్‌తోనూ అలరించింది. విడుదలైన ‘డోరా’ టీజర్ ఉత్కంఠ భరితంగా సాగి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్ ప్రారంభం నుంచే కారుతో మొదలుపెట్టగా ఎక్కడా చిన్న పాటి క్లూ కూడా ఇవ్వకుండా భయపెట్టడంలో మాత్రం దర్శకుడు దాస్ రామస్వామి తన టాలెంట్ ను చూపించాడు. కాసేపు మామూలుగాను.. మరోసారి భయపెట్టేట్లుగాను చేసిన నయనతార యాక్టింగ్ ని మాత్రం మెచ్చుకోవాల్సిందే.

Dora - Official Tamil Teaser

హీరోయిన్ నయన్ టీజర్ చివర్లో అలా నడుచుకుంటూ వస్తుంటే.. ఇచ్చిన బిల్డప్.. దానికి తగ్గట్టు వినిపిస్తున్న మ్యూజిక్.. తను ధరించిన టాప్ పైకి మడత పెడుతూ నడక.. ఇవన్నీ చూస్తుంటే.. స్టార్ హీరో రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా నయన్ ఈ మూవీలో రెచ్చిపోయిందనే విషయం అర్ధమవుతుంది. మొత్తంగా ఇప్పుడు డోరా టీజర్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుందనే చెప్పాలి.

- Advertisement -