రామనాయుడి కల నిజం చేస్తా…..

317
Daggubati Multistarrer Movie
- Advertisement -

దగ్గుబాటి రామానాయుడు నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించాడు రామానాయుడు . ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన.
Daggubati Multistarrer Movie
అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.సెప్టెంబర్ 9, 2010న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.

నేడు మూవీ మొఘల్ రామానాయుడు వర్ధంతి. ఈలోకాన్ని విడిచివెళ్లిపోయి రెండేళ్లు అయ్యింది. రామానాయుడు వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దకొడుకు సురేష్‌ బాబు ఈరోజు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి జ్ఞాపకాలన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
Daggubati Multistarrer Movie
ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన సురేష్‌బాబు తన తండ్రి కలల సినిమాను తీసి తీరుతానని ఆయన ప్రకటించారు. తన చిన్న కొడుకు వెంకటేష్…మనవళ్లు రానా…నాగచైతన్యల కాంబినేషన్లో మల్టిస్టారర్‌ సినిమా తీయాలని రామనాయుడు ఆశపడ్డారని కానీ ఆకోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారని ఆవేదనికి గురైయ్యారు సురేష్‌బాబు. నాన్న ఉండగా.. రానా.. నాగచైతన్య కెరీర్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్లు. కాబట్టి మల్టీస్టారర్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేకపోయాం అని సురేష్‌బాబు అన్నారు.
Daggubati Multistarrer Movie
వెంకటేష్‌ కూడా వీళ్లతో కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. మధ్యలో వెంకీ.. రానా కలిసి కొన్ని స్క్రిప్టులు కూడా విన్నారు కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం వెంకీ-రానా-చైతూ కాంబినేషన్లో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని. రామనాయుడి కలల సినిమా తర్వలోనే పట్టాలెక్కుతుందని సురేష్‌బాబు స్పష్టం చేశారు.

- Advertisement -