రాత్రిపూట ఇవి తింటున్నారా..జాగ్రత్త!

58
- Advertisement -

చాలామంది తినే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారు. సమయాభావం లేకుండా ఏది పడితే అది తింటూ ఉంటారు. అలా తినడం వల్ల లేని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట తినే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలట. లేదంటే నిద్రలేమి, ఎసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట హెవీగా ఫుడ్ తీసుకోవడం అసలు మంచిది కాదట. ఎక్కువ ఆహారం తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట చీజ్ బర్గర్, ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది..

ఎందుకంటే ఇలాంటి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పైగా రాత్రి పూట శారీరక శ్రమ లేనందున తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు ఫలితంగా అజీర్తి ఏర్పడి నిద్రకు భంగం వాటిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇక కొందరికి ఆహారం తిన్న వెంటనే స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. రాత్రిపూట స్వీట్స్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ మరింత ఎక్కువౌతాయి. ఇంకా స్వీట్స్ కారణంగా ఎసిడిటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక కేఫెన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా అస్సలు తీసుకోకూడదు. అనగా టీ కాఫీ వంటివాటిని అసలు సేవించకూడదు. ఎందుకంటే కెఫీన్ కారణంగా నిద్రలేమి సమస్య తీవ్రంగా మారుతుంది. తద్వారా ఉదయాన్నే కళ్ళు ఎర్రబడడం, ఒత్తిడి తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి రాత్రిపూట వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:KTR:కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు

- Advertisement -