కైకాల ఆరోగ్యంపై వదంతులు నమ్మోద్దు..

201
kaikala
- Advertisement -

నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు ఆయన కూతురు రమాదేవి. కొంతమంది కైకాల ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్నారు…వాటిని నమ్మవద్దని ఆడియో బైట్ లో కోరారు.

నాన్న గారు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది. డాక్టర్స్ అందించే చికిత్సకి స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు కూడా. దయచేసి ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు. అలాగే దయచేసి ఆయన ఆరోగ్యంపై అనవసర వార్తలను రాయడం, ప్రసారం చేయడం లాంటివి చేయకండి. ఆయన ఆరోగ్యంపై అనవసర వార్తలను ప్రసారం చేసి జనాల్ని ఆందోళన పరచవద్దు” అని తెలిపారు.

అపోలోలోనే చికిత్స తీసుకుంటున్నారు కైకాల. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -