NarayanaMurthy:శ్రీవారికి బంగారు అభరణాలు

61
- Advertisement -

తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో బంగారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి బంగారు ఆభరణాలను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో మూర్తి దంపతులను సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని బహుకరించారు.

70 ఏళ్లుగా తిరుమల కొండకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని ఆమె చెప్పారు. కోరుకున్న కోరికలు తీరడంతో అందరి భక్తుల మాదిరిగానే ఏటా శ్రీవారి దర్శనానికి వస్తున్నానని ఆమె చెప్పారు. పవిత్రమైన తిరుమల కొండకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని నారాయణమూర్తి అన్నారు.

Also Read:ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్‌ది కాదా?:జగదీష్ రెడ్డి

ఈ సందర్భంగా టీటీడీ సిబ్బందిని సుధామూర్తి ఆప్యాయంగా పలుకరించారు. కొంత మంది భక్తులు మూర్తి దంపతులతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

- Advertisement -