ట్రంప్‌పై హిల్లరీక్లింటన్‌ సంచలన వ్యాఖ్యలు…!!

214
online news portal
- Advertisement -

అమెరికా ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్ది అభ్యర్థుల్లో ప్రచార హోరు మరింత పుంజుకుంటోంది. డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆమెరికా మాజీ అధ్యక్షుడు బ్లిన్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య పోటీ హోరా హోరీగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సర్వేలన్నీ హిల్లరీకే అమెరికా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్న తరుణంలో, ఈ అంచనాలను తల క్రిందులు చేస్తూ హిల్లరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అమెరికాలో అమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

online news portal

ట్రంప్‌కు కూడా విజయావకాశాలు దక్కే చాన్స్‌ ఉందని ఆయన తన మద్ధతు దారులను హెచ్చరించారు. ట్రంప్ కు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని, మరో పది రోజుల పాటు ప్రజల్లోనే ఉండి ప్రచారం నిర్వహించాలని, ఏ క్షణాన్ని కూడా వదిలిపెట్టరాదని ఆమె అన్నారు. అయితే తీజా ఈ మెయిల్ స్కాం లో ఎఫ్ బీ ఐ విచారణ మొదలు పెట్టడంతో హిల్లరీక్లింటన్‌ మద్ధతు దారుల్లో అందోళన పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది

online news portal

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మిగిలింది 9 రోజులు మాత్రమే. ఇప్పటి వరకు రేసులో దూసుకుపోతున్న డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇటువంటి తరుణంలో ఎదురుదెబ్బ తగిలింది. హిల్లరీ ఈమెయిళ్ల వ్యవహారంపై దర్యాప్తును పునరుద్ధరించాలని తాజాగా ఎఫ్‌బీఐ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. హిల్లరీ 2009-2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ, వ్యక్తిగత ఈమెయిళ్లను పంపేందుకు ప్రైవేట్ సర్వర్‌ను వినియోగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తును పునరుద్ధరిస్తున్నామంటూ ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమే టాప్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. ఆ లేఖ అంశం రిపబ్లికన్ నాయకుడు మీడియాకు విడుదల చేసే వరకూ వైట్‌హౌస్‌కు, హోంశాఖకు ఇప్పటి వరకు తెలియదు.

online news portal

ఈ సంగతి ఇలా ఉంటే రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ ఒబామాపై మరోసారి విమర్శలు గుప్పించారు. అమెరికాలో ఆర్థికాభివృద్ధిని ఒబామా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని భారత్, చైనా లాంటి దేశాలు 8 శాతం, 7 శాతం వృద్ధితో దూసుకుపోతుంటే అమెరికాకు అది ఎందుకు సాధ్యం కాలేదని ఆయన ప్రశ్నించారు.మాంచెస్టర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన… ఒక సంవత్సరంలో కనీసం 3శాతం ఆర్ధికాభివృద్ధి కూడా సాధించలేకపోయారని ఒబామాపై ట్రంప్‌ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఫలితాలు భయానకంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

online news portal

తాను అధికారంలోకి వస్తే 4శాతం ఆర్థిక వృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ఆర్థికంగా ఉన్నతమైన దేశంగా మళ్లీ అవతరించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. హిల్లరీ నిర్ణయాల కారణంగా దేశంలో ఐఎస్‌ఐఎస్‌ ప్రాభల్యం మరింత పెరుగుతుందని.. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు దేశంలో తిష్టవేసి ఉన్నారని ట్రంప్‌ పేర్కొన్నారు.

- Advertisement -