- Advertisement -
2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలిపారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఎన్నికల్లో పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించిన తొలి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఇప్పటి నుంచే ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికతో ముందుకెళ్లే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
2016లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తుందని అంతా భావించగా ఎవరూ ఊహించని విధంగా ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు.
2020లో రెండోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఈ నెల 15న కీలక ప్రకటన వెలువరిస్తాను అన్నట్లుగానే తాను ఈ సారి అధ్యక్ష బరిలో ఉండనున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -