అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోబోను తయారుచేసింది ఫ్లోరిడా రాష్ట్రంలోని డిస్నీ వరల్డ్ సంస్థ. డిస్నీ వరల్డ్ మ్యాజిక్ కింగ్ డమ్ పార్కులో ‘హాల్ ఆఫ్ ప్రెసిడెంట్స్’ పేరిట అమెరికా అధ్యక్షుల రోబోలను తయారు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే డిస్నీ ఈ సంవత్సరం డోనాల్డ్ ట్రంప్ రోబోను తాయారు చేసింది.
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి ఈ రోబోను తయారుచేయాలని డిస్నీ వరల్డ్ నిర్వాహకులు అనుకుంటున్నారట. దీనికోసం కొన్ని నెలల క్రితమే డిస్నీ నిర్వాహకులు వైట్ హౌస్ ప్రతినిధులను సంప్రదించి, ట్రంప్ కొలతలు తీసుకున్నారు. ఆ ఫోటోను ట్విట్టర్ లో విడుదల చేసింది. అయితే ఈ రోబో ట్రంప్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కానీ ఈ రోబో ట్రంప్ లా లేరని, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ లా ఉందని కొందరు అంటుంటే, మరికొందరు హాలీవుడ్ నటుడు జాన్ వోయిట్ లా ఉన్నారని విమర్శిస్తున్నారు. ఇదిలాఉండగా ఈ పార్క్‌ను వచ్చే వారం సందర్శకుల కోసం తెరవనున్నారు.
So exciting!!
Disney’s Magic Kingdom has finally opened their doors to the highly anticipated Hall of Presidents — now featuring President Donald Trump! pic.twitter.com/o0m2Xe4M0l
— Corryn💙 (@Corrynmb) December 18, 2017