అమెరికా అధ్యక్ష ఎన్నికల వార్తలు ప్రపంచంలో సంచలనంగా మారాయి. ఎన్నికలకు ఇంకో మూడు వారాలు మాత్రమే ఉండడంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌లు ప్రచారంలో దూకుడు పెంచారు. అమెరికాకు నువ్వా-నేనా అనే రేంజ్‌లో వీరి మాటల యుద్దం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు డిబేట్లలో హిల్లరీ కంటే ట్రంప్ వెనకబడిపోయారు. ట్రంప్ గత వ్యవహారం గురించి వెలుగుచూస్తున్న వీడియో టేపులు వివాదాస్పదమవుతున్నాయి. మహిళలపై ఆయన వ్యవహరించిన తీరుతో సర్వత్ర విమర్శల పాలవుతున్నారు.
ఇప్పటికే ఐదుగురు మహిళలు ట్రంప్‌పై లైంగిక వేధింపుల కేసులు పెట్టగా ఇప్పుడు తాజాగా హిల్లరీ క్లింటన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ట్రంప్ బాధితురాలినేనని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఓ టీవీ చానల్ చర్చాగోష్టిలో పాల్గొన్న హిల్లరీ మాట్లాడుతూ.. ప్రేమోన్మాదిగా మారిన ట్రంప్ తన వెంట కూడా పడ్డారని, మీదిమీదికొచ్చారని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఆరోపణలు నిరాధారమని, తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకే ఆమె ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ అన్నారు.
2005లో నాటి మహిళల గురించి సీబీఎస్ న్యూస్ సంస్థ వీడియోను ప్రసారం చేసింది. ఇందులో అప్పటికి 46 ఏళ్ల వయసున్న డోనాల్డ్ ట్రంప్.. ఓ యువతిని ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారు. 1992లో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతిని అక్కడున్న రియాల్టీ టీవీ స్టార్… ‘ఎస్కలేటర్ ఎక్కుతున్నావా’ అని అడగ్గా, ఆమె అవునని చెబుతుంది. అప్పుడు ట్రంప్ కెమెరా వైపు తిరిగి, ”మరో పదేళ్లలో నేను ఆమెతో డేటింగ్ చేస్తాను. మీరు నన్ను నమ్మగలరా?” అని అడుగుతారు. నవంబర్ 8వ తేదీనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో.. దానికి మూడు వారాల ముందు ఇలాంటి ఘటనలు జరగడం ఆయన విజయావకాశాలను మరింత దెబ్బతీస్తోంది.