చూపు తిప్పుకోనివ్వని ఐష్‌..

540
RANBIR AND AISH ARE SIZZLING IN ADHM
RANBIR AND AISH ARE SIZZLING IN ADHM
- Advertisement -

బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్యరాయ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అభిషేక్ బచ్చన్తో పెళ్లై.. ఆరాధ్య పుట్టిన తరువాత ఐష్‌ ఇంటికే పరిమితమైంది. చాలా రోజుల తరువాత ఐష్‌ మళ్లీ వెండితెరపై కనిపించింది. గతంలో సరబ్‌జిత్ సింగ్‌ సినిమాలో పాకిస్తాన్ జైల్లో చనిపోయిన సరబ్‌ జిత్‌ సింగ్‌కు అక్కగా నటించింది. అయితే ఈ సినిమాతో ఐష్‌.. పెద్దగా ఎలివేట్ కాలేదు. తాజాగా ఐష్‌.. ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణబీర్ కపూర్‌తో రెచ్చిపోయి నటించింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’పై సినీ వర్గాల్లో ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా చిత్రీకరించిన ‘బులెయా..’ సాంగ్ నెట్ లో విడుదలైన కొద్ది గంటలకే గణనీయమైన హిట్స్ సాధించింది. ఈ పాటలో 42 ఏళ్ల ఐశ్వర్య.. 33 ఏళ్ల రణ్ బీర్ కపూర్ తో కలిసి రొమాన్స్ ను అద్భుతంగా పండించింది.

aish

అదిరిపోయే రొమాంటిక్ సీన్లలో అద్భుతమైన కెమెస్ట్రీని పండించిన ఐశ్వర్యరాయ్, రణ్ బీర్ సింగ్ లు ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా అంచనాలను అమాంతం పెంచేశారు. మరో పాటలో హీరోకు కన్నుగీటి కవ్వించి, చూపు తిప్పుకోనివ్వని కళ్లతో మైమరపించి, అతని బుగ్గలకు క్రీమ్ రాసి పెదవులతో తుడిచి.. ఇంకా రకరకాల చేష్టలతో ఐశ్వర్య రాయ్ అదరగొట్టింది.

Unknown

ఇప్పటికే రిలీజ్ అయిన సాగ్స్, ట్రైలర్స్ లో ఐశ్వర్య రెచ్చిపోయి నటించగా.. ప్రస్తుతం సోషల్ మీడియలో సంచలనం రేపుతోన్న ఫొటోలోనూ అందేస్థాయిలో కనిపించారు. ఐశ్వర్య, రణ్ బీర్ లపై ఇటీవల ఓ ఫొటో షూట్ కు చెందిందంటూ ప్రచారంలో ఉన్న ఫొటో ఇది.

- Advertisement -