రామ్‌దేవ్‌ కామెంట్స్‌పై నిరసన..డాక్టర్స్ బ్లాక్ డే

175
ima
- Advertisement -

బాబా రామ్‌దేవ్ కామెంట్స్‌కు నిరసనగా బ్లాక్‌ డేని పాటిస్తున్నారు డాక్టర్లు . దేశ‌వ్యాప్తంగా వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ప‌ని చేసే చోటే నిర‌స‌న తెలుపుతున్నారు డాక్టర్లు. రామ్‌దేవ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి…..లేదంటే ఆయ‌న‌పై మ‌హ‌మ్మారి వ్యాధుల చ‌ట్టం, 1987 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఎఫ్‌ఓఆర్‌డీఏ తెలపగా ఈ నిర‌స‌న‌కు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేషన్ కూడా మ‌ద్ద‌తు తెలిపింది.

ఆధునిక వైద్య చికిత్స‌లు తెలివి లేనివ‌ని, అలోప‌తి ల‌క్ష‌ల మందిని చంపేసింద‌ని రామ్‌దేవ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి కంటే ఆధునిక వైద్యం వ‌ల్లే ఎక్కువ మంది చ‌నిపోయార‌ని రామ్ దేవ్ వ్యాఖ్యనించడంపై ప్రధానికి సైతం ఫిర్యాదు చేశారు డాక్టర్లు.

అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని, ఆధునిక వైద్యాన్ని త‌క్కువ చేసే ఆలోచ‌న ఆయ‌న‌కు లేద‌ని రామ్‌దేవ్‌కు చెందిన ప‌తంజ‌లి గ్రూప్ వివ‌ర‌ణ ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావడంతో రామ్‌దేవ్ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు.

- Advertisement -