ఈ చేప ఖరీదు 72 లక్షలు..ఎక్కడో తెలుసా..!

71
Atlantic-Croaker

మీరు చదివింది నిజమే. ఈ చేప ఖరీదు అక్షరాలా 72 లక్షలు. పాకిస్తాన్‌కు చెందిన సాజిత్ హాజీ, అబు బకర్ అనే వ్యక్తులు చేపల వేటతో జీవనం సాగిస్తుండగా వారి జీవితాన్ని ఓవర్‌నైట్‌లో మార్చేసింది ఈ చేప.

చేప‌ల వేట‌తో జీవ‌నం సాగిస్తున్న వీరికి అట్లాంటిక్ క్రోకర్‌ రూపంలో కాసులు కురిపించింది. ఆసియా, యూర‌ప్ దేశాల్లో ఈ చేపకు గిరాకి ఎక్కువగా ఉండగా 48 కిలోల విలువైన ఈ చేప‌ను రూ.72 లక్ష‌ల‌కు అమ్మేశారు. అయితే, వేలంలో ఈ చేప రూ.84.2 ల‌క్ష‌లు పలికిన‌ప్ప‌టికి, సంప్ర‌దాయాల ప్ర‌కారం డిస్కౌంట్ ఇవ్వ‌డంతో రూ.72 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.