దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా…

69
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,510 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 2,795 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,75,044కు చేరగా కరోనా నుండి 2,59,47,629 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్ కేసులుండగా 3,31,895 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.09శాతానికి పెరగగా వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.64 శాతంగా ఉంది. టీకా డ్రైవ్‌లో భాగంగా 21,60,46,638 డోసులు పంపిణీ చేయగా మొత్తం 34,67,92,257 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.