కరుణానిధి ఇకలేరు..

237
DMK Chief Karunanidhi is no more
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు డా. కళైజ్ఞర్ గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి(95) కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో కరుణానిధి చేరిన సంగతి తెలిసిందే. కాగా, వయో భారం కారణంగా కరుణానిధి అవయవాలు చికిత్సకు స్పందించలేదు.

DMK Chief Karunanidhi is no more

ఆయన ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరుణ మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు చేరుకుంటున్నారు.

- Advertisement -