నాగార్జున-నానిల ‘దేవదాస్’ ఫస్ట్ లుక్..!

199
Devadas first look

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టిస్తోన్న దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ ఏడాది రానున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్స్‌లో ఈ సినిమా ముందు వ‌రుస‌లో ఉంది. దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్‌లో టైటిల్ తో పాటు నాగార్జున, నాని పాత్ర‌ల గురించి కూడా ప‌రిచ‌యం చేశారు. ఎవ‌రు దేవ్.. ఎవ‌రు దాసుగా న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని ఫ‌స్ట్ లుక్ తెలియ‌చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వై జ‌యంతి మూవీస్ సంస్థ‌పై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సి ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దేవ‌దాసు వ‌స్తుంది.

Devadas first look

తారాగణం: నాగార్జున అక్కినేని నాని, రష్మిక మండన, ఆకాంక్ష సింగ్, నరేష్ వికె, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఆవసరాల శ్రీనివాస్, సత్య.. సాంకేతిక నిపుణులు: బ్యానర్: వైజయంతి మూవీస్, నిర్మాత: అశ్వినీదత్, దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య, దోపిడీ: శామ్ దాత్ సైనుద్దీన్, సంగీతం: మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, మాటలు: వెంకట్ డి పతి, కొరియోగ్రఫీ: బృంద , ప్రేమ్ రక్షిత్, శేఖర్ మాస్టర్, చీఫ్ కో-డైరెక్టర్ : సదాశివ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, పిఆర్‌ఓ: వంశీ శేఖర్.