డీకే..దేశంలోనే ధనిక ఎమ్మెల్యే!

3
- Advertisement -

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నట్లు క్యాబినెట్ సహచరులకు తెలపడంతో.. కర్ణాటకలో అధికార మార్పిడికి మార్గం సుగమమైంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ … కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ డీకే శివకుమార్? ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? అనేదానిపై నెటిజన్లు వెతుకుతున్నారు. .

డీకే శివకుమార్ అసలు పేరు..దొడ్డాలహళ్లి కెంపెగౌడ (డీకే) శివకుమార్. మే 15, 1962న జన్మించారు. మే 2023 నుండి ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. ఆయన కర్ణాటకలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే మాత్రమే కాకుండా, భారతదేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యేగా రికార్డుకెక్కారు.

డీకే శివకుమార్ 2020 నుండి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు 2008 నుండి 2010 వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008 నుండి ఇప్పటివరకు ఆయన కనకపుర అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 1989 నుండి 2008 వరకు సాతనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.

కర్ణాటక జనాభాలో సుమారు 15% ఉన్న అత్యంత ప్రభావవంతమైన ‘ఒక్కలిగ’ సామాజిక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో కర్ణాటక ప్రభుత్వంలో ఆయన కీలకమైన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.

శివకుమార్ తన రాజకీయ జీవితాన్ని 1980ల ప్రారంభంలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో పట్టుబట్టారు. 1989లో కాంగ్రెస్ టికెట్‌పై మైసూరు జిల్లాలోని సాతనూరు నియోజకవర్గం నుండి కేవలం 27 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు..ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్‌కు వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్‌గా గొప్ప పేరుంది. 2002లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు శివకుమార్ కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడేందుకు బెంగళూరు శివార్లలోని తన రిసార్ట్‌లో వారం రోజుల పాటు వారికి ఆతిథ్యమిచ్చారు. ఓటింగ్ రోజు వరకు వారిని సురక్షితంగా ఉంచి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. అప్పటి నుండి పార్టీకి ఎలాంటి సంక్షోభం వచ్చినా అధిష్టానం శివకుమార్‌నే నమ్ముకుంటూ వస్తోంది.

- Advertisement -