ERC ముందుకు BRS!

6
- Advertisement -

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ పేరుతో చేపట్టిన చర్యలను మరియు ఆ నిర్ణయం వెనుక ఉన్న కుట్రలను ప్రజల ముందు ఉంచేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) ముందు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో, తెలంగాణ రైతాంగం మరియు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తన గళాన్ని వినిపించనుంది.

ఈ ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఈ బృందంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో పాటు ఇతర సీనియర్ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

‘రైతు డిస్కం’ ప్రతిపాదనల వల్ల రైతాంగానికి, రాష్ట్ర విద్యుత్ రంగానికి వాటిల్లే నష్టాలను మరియు ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Also Read:డీకే..దేశంలోనే ధనిక ఎమ్మెల్యే!

- Advertisement -