దిశ హంతకులకు ఉరి శిక్షవేయాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగ ఇవాళ జీరో అవర్‌లో దిశ అత్యాచార,హత్య ఘటన జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆమె అత్యాచార ఘటనపై ఒక రోజు చర్చ చేపట్టి, కఠినతరమైన చట్టం తీసుకురావాలన్నారు.
ప్రతి ఏడాది 33వేల అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విధంగా కఠిన చట్టం తేవాలన్నారు. పార్టీలకు అతీతంగా చట్టం తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
దిశ అత్యాచార నిందితులకు 30 రోజుల్లోగా కఠిన శిక్షను అమలు చేయాలని ఎంపీ నామా నాగేశ్వరావు అన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. పది బృందాలుగా మారి పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు ఎంపీ నామా తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో 30 రోజుల్లోనే నిందితులను శిక్షించాలన్నారు.
Hyderabad vet doctor ‘Disha’ has shook the Parliament today. Disha issue became hot topic in Rajya Sabha where the members of the house have demanded