గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన జర్నలిస్టులు..

413
Telangana Journalists

హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో గ్రీన్ ఛాలెంజ్.. హరితహారం కార్యక్రమం పేరుతో తెలంగాణ జర్నలిస్టులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మీడియా అకాడెమీ, సమాచార శాఖ అధికారులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Journalists in Green challenge

హరితహారం గొప్ప కార్యక్రమం, తెలంగాణ పచ్చబడాలే అనే సంకల్పంతో కేసీఆర్ ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. ఈ రోజు మేము నాటిన మొక్కకు శంషాబాద్ దుర్ఘటనకు గుర్తుగా దిశ అని నామకరణం చేస్తున్నామని ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులు అందరూ హరితహారం స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మెల్యే క్రాంతి ఈ సందర్భంగా తెలిపారు.

Telangana Press Academy Chairman Allam Narayana has accepted the Green Challenge thrown at him by TRS MP J Santosh Kumar. On Monday..