పూరీ స్టైల్ ఛేంజ్..అందుకే డిజాస్టర్స్!

26
- Advertisement -

ఒకప్పుడు పూరీ జగన్నాథ్ అంటే హీరోయిజానికి పెట్టింది పేరు. తన సినిమాలోని హీరోలకు కేవలం డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ తోనే ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తాడు. ఇడియట్, పోకిరి, దేశముదురు, బుజ్జిగాడు, టెంపర్.. ఇలా తన ప్రతి సినిమాలో హీరోలను కొత్తగా ప్రజెంట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. అయితే ఇదంతా ఒకప్పుడు.. ప్రస్తుతం పూరీ ఒక్క హిట్ కోసం నానా ఆపసోపాలు పడుతున్నాడు. టెంపర్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి కూడా పూరీ ఖాతాలో లేదు. దాంతో ఈ డాషింగ్ డైరెక్టర్ క్రేజ్ మెల్లగా మసకబారుతోంది. స్టార్ హీరోలెవ్వరు డేట్స్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం కుర్ర హీరోలతోనే మూవీస్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండతో ఆయన చేసిన గత చిత్రం లైగర్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. .

ఆ మూవీ ఫ్లాప్ తర్వాత ప్రస్తుతం రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంకా సెట్స్ పైనే ఉంది. మొదట ఈ మూవీని శివరాత్రి కానుకగా మార్చి 8 విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడంతో వాయిదా వేయక తప్పలేదు. అయితే గతంలో మూవీ అనౌన్స్ చేసిన ఆరు నెలల్లోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేసే పూరీ జగన్నాథ్ ప్రస్తుతం స్లో అయ్యాడు. ఆయన గత చిత్రం లైగర్ కూడా దాదాపు రెండేళ్ళు షూటింగ్ జరుపుకుంది.

అయినప్పటికి ఆ మూవీ ఫ్లాప్ గానే నిలిచింది, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న డబుల్ ఇస్మార్ట్ కూడా ఇంకా సెట్స్ పైనే ఉంది. దీంతో పూరీ తన షూటింగ్ స్టైల్ ను మార్చడా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో ఫాస్ట్ గా మూవీస్ చేసి సూపర్ హిట్స్ కొట్టిన పూరీ ఇప్పుడు స్లోగా మూవీస్ చేస్తూ ఫ్లాప్ చూస్తున్నడని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందువల్ల తమకు పాత పూరీనే కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి డబుల్ ఇస్మార్ట్ మూవీతోనైనా పూరీ మళ్ళీ స్ట్రాంగ్ కామ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Also Read:కవిత అరెస్ట్ వెనకుంది బీజేపీనే!

- Advertisement -