కాటమరాయుడి కోపం తగ్గిందా…!

566
online news portal
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో యవ్వారం కాస్త తేడాగానే ఉంటుంది. ప‌వ‌న్ మెంటల్‌అయితే… ఆ ద‌ర్శ‌కుడి ప‌ని న‌ల్లేరుపై న‌డ‌కే. తేడా వ‌స్తే.. అంతే సంగ‌తులు. ప‌వ‌న్ మూడ్‌ని బ‌ట్టి న‌డుచుకోవ‌డం ఏ ద‌ర్శ‌కుడికైనా క‌త్తిమీద సాము. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సెట్లో ప‌వ‌న్ కి.. ఆ సినిమా కెమెరామెన్‌కీ త‌ర‌చూ గొడ‌వ‌ల‌య్యేవట. అందుకే.. షూటింగ్ మొద‌లైన కొన్ని రోజులకే సాంకేతిక నిపుణుల్లో మార్పులూ చేర్పులూ జ‌రిగాయి. సేమ్ టూ సేమ్ కాట‌మ‌రాయుడు సెట్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంద‌న్న‌ది ఇన్‌సైడ్ న్యూస్‌.

online news portal

సోమ‌వారం హైద‌రాబాద్‌లో కాట‌మ‌రాయుడు షూటింగ్ జ‌రిగింది. సెట్లో ద‌ర్శ‌కుడు డాలీకీ, ప‌వ‌న్‌కీ మ‌ధ్య ఏదో విష‌య‌మై… చిన్న గొడ‌వ వ‌చ్చింద‌ట‌. ద‌ర్శ‌కుడి వైఖ‌రిపై అలిగిన ప‌వ‌న్‌.. సెట్లోంచి హుటాహుటిన వెళ్లిపోయాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ లేక‌పోవ‌డంతో… షూటింగ్ కాసేపు ఆగిపోయింద‌ని, ఆ త‌రువాత ప‌వ‌న్ లేని సీన్లు తీసుకోవాల్సిచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శ‌ర‌త్ మ‌రార్ ప‌వ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడు. ద‌ర్శ‌కుడికీ, ప‌వ‌న్‌కీ వాద‌న జ‌రుగుతున్న‌ప్పుడు సెట్లో శ‌ర‌త్ మ‌రార్ కూడా ఉన్నాడ‌ట‌. అయితే.. ప‌వ‌న్‌ని ఎదిరించే ధైర్యం లేక కామ్‌గా ఉండిపోయాడ‌ట శ‌ర‌త్ , ఆ త‌ర‌వాత ప‌వ‌న్‌ని స‌ర్దిచెప్పే ప‌నిలో లీన‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది.

అయితే కాసేపటి తరువాత తర్వాత మళ్లీ వచ్చిన పవన్ యథావిధిగా షూటింగ్‌లో పాల్గొన్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే కేవలం సీను బాగా రానందుకు పవన్ డాలీపై అరిచాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి దర్శకుడితో గొడవ పడ్డాక, ఇద్దరి మధ్య మళ్లీ షూటింగ్ సజావుగా సాగుతుందా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

online news portal

ఈ చిత్రానికి మొదట అనుకున్న దర్శకుడు ఎస్.జె.సూర్య. ఐతే అతను అనుకోని కారణాలతో తప్పుకోవడం ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో డాలీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు పవన్. ఇంతకుముందు పవన్ తో ‘గోపాల గోపాల’ సినిమా చేశాడు డాలీ. ఆ సందర్భంగానే అతడి టాలెంట్ గుర్తించి మరో అవకాశం ఇస్తానన్నాడు పవన్. ఈ హామీని ‘కాటమరాయుడు’తో నెరవేర్చాడు. ఇప్పుడేమో అతడి పనితీరుపై ఆగ్రహించాడంటున్నారు. ఐతే ఇలాంటివి షూటింగులో మామూలే అనే ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

online news portal

ఈ షూటింగ్‌లో శృతిహాసన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక పవన్‌కు బైక్‌ రైడింగ్‌లు, గన్‌లు అంటే చాలా ఇష్టం. గోపాల గోపాల కోసం పవన్‌ ప్రత్యేకంగా ఓ బైక్‌ను డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఇక కాటమరాయుడులో కూడా పవన్‌ ప్రత్యేకంగా ఓ బుల్లెట్‌ పై తిరుగుతూ సందడి చేయనున్నాడు. మరి ఆయనకిష్టమైన గన్‌లు కూడా ఈ చిత్రం కోసం వాడుతున్నారా?లేదా?అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాటమరాయుడుగా పవన్‌ ఎలా కనిపించబోతున్నాడు? ఈ సినిమా ఉగాది కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే

- Advertisement -