ప్రియాంకతో మందు తాగించిన యాంకర్‌..!

225
In the name of fun, did Ellen insult Priyanka Chopra?
- Advertisement -

ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తున్న ప్రియాంక చోప్రాకు అవమానం జరిగిందంటూ ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రియాంక చోప్రా ఇటీవల నూయార్క్‌లో ‘ది ఎలెన్స్‌ షో’ అనే సెలబ్రెటీ చాట్‌లో పాల్గొంది. ఈ షోలో హోస్ట్‌ ఎలెన్‌.. ప్రియాంకతో సరదాగా మాట్లాడుతూనే అవమాన పరిచినట్లుగా వ్యవహరించిందట. లైవ్‌ షోలో ప్రియాంక చేత టెకీలా(మద్యం) తాగించడమే కాకుండా ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యాక అభివాదం చేసినప్పుడు అదేదో విద్యుత్‌ బల్బు తీస్తున్నట్లు చెయ్యి వూపారు అందట. ప్రియాంక పట్ల ఎలెన్‌ తీరు బాలేదని ప్రియాంక అభిమానులు మండిపడ్డారు.

did Ellen insult Priyanka Chopra?

మాటల మధ్యలో ఎలెన్‌.. ‘మీరు ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయిపోయారు. మీ అందం, నటన కూడా ప్రేక్షకులకి బాగా నచ్చింది’ అనగానే ప్రియాంక.. ‘అలాంటిదేం లేదు’ అని చెప్పగా.. దాంతో కోపమొచ్చిన ఎలెన్‌.. ‘ఆ విషయం నాకు తెలుసు ఏదో మిమ్మల్ని పొగడాలి కాబట్టి అలా అన్నాను’ అని వెటకారంగా మాట్లాడిందట. కానీ ప్రియాంక మాత్రంపాజిటివ్‌గా తీసుకుని నవ్వేసి వూరుకుందట. ఎలెన్ నా షో.. నా ఇష్టం.. తీరులో ప్రవర్తించింది అంటూ సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 These-pictures-of-Priyanka-Chopra-in-Quantico-2-are-even-better-than-her-bikini-avatar

‘క్వాంటికో’ టెలివిజన్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ప్రస్తుతం ‘బేవాచ్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ఇందులో విలన్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది. బాలీవుడ్‌ సెక్సీ భామ ప్రియాంక ఎక్స్‌పోజింగ్‌కు తప్పులేదని అప్పట్లోనే ప్రకటించింది.  అయితే.. ఇందులో బాత్‌రూమ్‌ సీన్లు, లిప్‌లాక్‌ సీన్లు బాగానే వున్నాయట.  బాత్‌రూమ్‌లో షవర్‌ దగ్గర పైభాగాన్ని తీసేసి ప్రియుడితో లిప్‌కిస్‌లు, చేసుకున్న సీన్లు లీకైయ్యాయి. క్వాంటికో హాలీవుడ్ సీరియల్‌ ప్రమోషన్‌లో భాగంగా వీటిని విడుదల చేసినట్లు తెలుస్తుంది. యూత్‌ను టెంప్ట్‌చేసే ఇటువంటి సీన్లు… ఆమెకు ఎటువంటి క్రేజ్‌ తెస్తాయో చూడాల్సిందే.

priyanka

- Advertisement -