అనిల్ సుంకరతో విఐ ఆనంద్‌

21
- Advertisement -

దర్శకుడు విఐ ఆనంద్ తన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’తో బ్లాక్ బస్టర్ అందించారు, ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని సమర్పించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

రాజేష్ దండా, అజయ్ సుంకర సహ నిర్మాతలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి కొత్త సినిమాకు కూడా పని చేయనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏ టీవీ సమర్పిస్తోంది.

విఐ ఆనంద్ సూపర్ నేచురల్ అడ్వంచర్స్ చేయడంలో దిట్ట. ఈ కొత్త చిత్రం కథ, సెటప్ పరంగా యూనిక్ గా ఉండబోతోంది. ఈ మెగా-బడ్జెట్ వెంచర్ TFIలో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతోంది.ఈ సినిమా హీరో, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

Also Read:చారి 111..ఆపరేషన్ రుద్రనేత్ర

- Advertisement -