పాపులర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ చరణ్ హీరోగా సినిమా ఇటీవలె అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీకి సంబంధించి కీ అప్‌డేట్ వచ్చేసింది. ఇవాళ ఉదయం పూజతో సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్, రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సునీల్, దిల్ రాజు, తమన్ తదితరులు హాజరయ్యారు.
మొదటి షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని ప్రధాన తారాగణం, సిబ్బందిని పరిచయం చేశారు. అందరూ నల్ల సూట్లు, గాగుల్స్ ధరించి ఉండడం ఆకట్టుకుంటుంది. మాలీవుడ్ స్టార్ జయరామ్, స్టార్ కమెడియన్ టర్న్ హీరో సునీల్, తెలుగు నటి అంజలి, హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.