తెలంగాణలో నీలి విప్లవం..

195
harish
- Advertisement -

సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లో చేప పిల్లలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి విడుదల చేశారు హరీష్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనన్నారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా , ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోందన్నారు. తెలంగాణ లో ఎక్కడా చూసిన ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కళ్ళ ముందు కనబడుతుతుందని వెల్లడించారు. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి చేపలను ఉత్తర భారతం తో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని స్పష్టం చేశారు హరీష్‌ రావు. సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందన్నారు.

కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతున్నదని పేర్కొన్నారు.

- Advertisement -