అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో “మై డియర్ మార్తాండం” ట్రైలర్..

272
My Dear Marthand
- Advertisement -

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, కళ్యాణ్ విటపు (అర్జున్ రెడ్డి ఫేం)లు ముఖ్య తారాగణంగా కోర్ట్ రూమ్ డ్రామా కామెడీ ఇంటరాగేషన్స్ జోనర్‌లో తెరకెక్కిన చిత్రం ‘మై డియర్ మార్తాండం”. ఈ సినిమా ట్రైలర్‌ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ విడుదల చేశారు.

దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే ఔట్ అండ్ ఔట్ కామెడీగా సినిమా తెరకేక్కినట్టు కనపడుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రిస్మస్‌కి సిని ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.., అని అన్నారు.

హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ.. మా సినిమా పుల్ లేన్త్ కామెడి సస్పెన్స్ జోనర్‌లో తెరకెక్కించాం. చాలా బాగుంటుంది, అని తెలిపారు. హీరోయిన్ కల్పికా గణేష్ మాట్లాడుతూ.. దర్శకుడు హరీష్ కె.వి మంచి పాయింట్ తో ఈ సినిమాను తీశారు. సస్పెన్స్ డ్రామాలో సినిమా నడుస్తుంది, మీ అందరికి నచ్చుతుంది అన్నారు. హీరో కళ్యాణ్ విటపు మాట్లాడుతూ.. మంచి సినిమాను తీసాం, ఈ క్రిస్మస్‌కి మిమ్మల్ని నవ్వించేందుకు వస్తున్నాం అన్నారు.

My Dear Marthand

దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది, కోర్ట్ రూమ్ డ్రామా, కామేడి ఇంటరాగేషన్స్ బ్యాక్డ్రాప్‌లో కథ నడుస్తుంది, సినిమాలో పృథ్వి కామెడీ చాలా బాగా వచ్చింది, ఈ డిసెంబర్ 29న వస్తున్నాం. ప్రేక్షకులు ఆధరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

సుదర్శన్, హరీష్ కోయలగుండ్ల, మహేష్ విట్టా. గోకుల్, భరద్వాజ్, జబర్దస్త్ ప్రసాద్ లు మిగతా తారాగణంగా నటించిన ఈ సినిమాకు సంగీతం : పవన్. లిరిక్స్ : వెన్నలకంటి, రాకేందు మౌళి. ఎడిటర్ : గ్యారీ BH ఆర్ట్ డైరెక్టర్ : ప్రవీన్ DOP : రామ్ రెడ్డి నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్. రచన – దర్శకత్వం : కె.వి.హరీష్.

- Advertisement -