ఫ్లాస్మా దాతలు రియల్ హీరోలు: రాజమౌళి

226
rajamouli
- Advertisement -

కరోనా ఫ్లాస్మా దాతలు రియల్ హీరోలని తెలిపారు దర్శకుడు రాజమౌళి. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో ఫ్లాస్మా దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు.

తాను కరోనా నుంచి రికవరీ అయ్యానని పూర్తిగా కోలుకున్న తర్వాత తాను ఫ్మాస్మాదానం చేసి హీరోనవుతానని చెప్పారు. తల్లిదండ్రులు ఫ్లాస్మా దానం చేస్తే తిరిగి కరోనా వస్తుందని భయపడుతున్నారని ఇందులో నిజం లేదన్నారు. ఫ్మాస్మా దానం చేయడం వల్ల తిరిగి కరోనా రాదన్నారు.

ఫ్లాస్మా దానం పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి సీపీ సజ్జనార్‌ అండ్ టీం కృషిచేస్తుందని అభినందించారు. ఇది నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు రాజమౌళి. కరోనా బాధితులు కోలుకోవడానికి ఫ్లాస్మా థెరపీ బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇంతమంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సజ్జనార్‌ని అభినందించారు జక్కన్న.

- Advertisement -