వీరుడి కథకు మళ్లీ జీవం పోశారుః రాజమౌళి

473
Syeraa Rajamouli
- Advertisement -

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈచిత్రానికి సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈమూవీని విడుదల చేశారు. ఇక ఈమూవీకి అద్భుతమైన స్పందన వస్తోంది.

అన్నీ భాషల్లో బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈసినిమా చూసిన పలువరు సినీ ప్రముఖులు కూడా సైరా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈసినిమాపై స్పందించాడు. సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి గారు ప్రాణప్రతిష్ట చేశారని కితాబిచ్చారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథకు మళ్లీ జీవం పోశారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

జగపతిబాబు గారు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ప్రతి ఒక్కరూ కథలో ఇమిడిపోయే పాత్రలతో సినిమాకు వన్నె తెచ్చారని రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.

- Advertisement -