కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్నతాజా చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్నారో తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, మ్యూజిట్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ మూవీ ప్రమోషన్స్ కీ భారీగానే ఖర్చుచేస్తున్నారు డీవీవీ దానయ్య. మరోవైపు మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారట.
ఈ సినిమా గురించి డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ కథను మహేష్ బాబుకి చెప్పగానే మరేం ఆలోచించకుండా ఓకే చెప్పారని శివ తెలిపారు. ఈ కథపై ఇంత నమ్మకం ఉంచినందుకు మహేష్ బాబుకి ప్రత్యేకంగా థ్యాక్స్ చెబుతున్నానన్నారు. ఈ సినిమాకి టీం మొత్తం హార్డ్ వర్క్ చేశామని అందుకునే ప్రేక్షకులలో పాటలు, టీజర్ కనెక్ట్ అయ్యాయన్నారు. పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నందుకు మంచి ఫిలితం కనిపిస్తోందన్నారు. ఈ పాటల విషయంలో రామజోగయ్య శాస్త్రికి థ్యాంక్స్ చెప్పాలి అని కొరటాల శివ తెలిపారు.
మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్త రిలీజ్ లో భాగంగా అమెరికాలో ముందుగా విడుదలకు సిద్దమయ్యింది. 2000 ప్రీమియర్ షోలను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. మొదటి వీకెండ్‌లో మొత్తం 10వేల షోలు ఉండేట్లుగా ఏర్పాట్లు చేశారట. ఏపీలోను అదనపు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా అయిపోయాయని ప్రచారం సాగుతోంది.