సెంటిమెంట్ ను ఫాలో అవుతోన్న‌ దిల్ రాజు

259
Dil-Raju
- Advertisement -

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో దిల్ రాజు కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న నిర్మాణ సంస్ధ‌లో రెండు సినిమాలు షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. శ‌త‌మానం భ‌వతి ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగ‌శ్న ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా శ్రీనివాస క‌ళ్యాణం సినిమా అలాగే వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ బాబు ఓ సినిమాను చేస్తోన్నాడు. నితిన్ చేస్తోన్న శ్రీనివాస క‌ళ్యాణం సినిమాలో రాశిఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈసినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టు చెబుతోన్నారు.

srinivasa kalyanam movie

ఈసినిమాను ఆగ‌స్ట్ 9వ తేదిన విడుద‌ల చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోన్నాడు నిర్మాత దిల్ రాజు. ముందుగా ఈచిత్రాన్ని జులై చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు ప్ర‌క‌టించినా ఆత‌ర్వాత మ‌ళ్ళి నిర్ణ‌యం మార్చుకున్నారు శ్రీనివాస క‌ళ్యాణం చిత్ర బృందం. శ్రీనివాస క‌ళ్యాణం విడుద‌లపై మ‌రోసారి త‌న సెంటిమెంట్ ను న‌మ్ముకొబోతున్నాడు నిర్మాత దిల్ రాజు.

srinivasa kalyanam movie

ఆగ‌స్టు 7వ తేదిన సినిమాను రిలీజ్ చేయ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న నిర్మించిన బొమ్మ‌రిల్లు సినిమా కూడా ఆగ‌స్టు 7న విడుద‌ల చేశారు. దింతో ఆసినిమా ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దింతో మ‌రోసారి అదే సెంటిమెంట్ తో శ్రీనివాస క‌ళ్యాణం సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కుటుంబ విలువ‌ల‌తో కూడిన సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈమూవీ ఏ మేర‌కు విజయం సాధిస్తోందొ చూడాలి. దిల్ రాజు సెంటిమెంట్ ఈసారి వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -