అలాంటి సిత్రాలు…. టీజ‌ర్‌ రిలీజ్

448
dil raju
- Advertisement -

అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్ లో స్క్రిప్ట్ & డైరెక్షన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి, పూరి జగన్నాధ్ వద్ద రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో ఐ &ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అలాంటి సిత్రాలు’. రాహుల్ రెడ్డి నిర్మాతగా, ప్రముఖ జర్నలిస్ట్ ,శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

నేడు ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేశారు. టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌నీ, ఒక వైవిధ్య‌మైన క‌థ‌తో, ఉత్కంఠ‌భ‌రిత క‌థ‌నంతో సినిమా రూపొందింద‌నే న‌మ్మకాన్ని టీజ‌ర్ క‌లిగిస్తోంద‌నీ ఆయ‌న అన్నారు. ‘అలాంటి సిత్రాలు’ మంచి విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.నలుగురు భిన్న త‌ర‌హా వ్య‌క్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అలాంటి సిత్రాలు’.టీజ‌ర్‌లో, “ఒక‌టి గుర్తు పెట్టుకో. నాశ‌న‌మవ్వాలంటే అన్నీ స‌హ‌క‌రిస్తాయ్‌. కానీ బాగు ప‌డాలంటేనే వంద అడ్డంకులొస్తాయ్.” అంటూ ఒక ప్ర‌ధాన పాత్ర‌ధారి ప్ర‌వీణ్ యండ‌మూరి చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆయ‌న‌తో పాటు అజ‌య్ క‌తుర్వార్‌, శ్వేతా ప‌రాశ‌ర్‌, యష్ పురి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

వీరిలో శ్వేతా ప‌రాశ‌ర్ ఒక వేశ్య పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఆమెతో యష్ పురి “అయినా నీతో తిరిగితే త‌ప్పేంటి? నువ్వొక ప్రాస్టిట్యూట్ అంట‌. అది కూడా ఒక ప‌నే క‌దా” అన‌డం.. ప్ర‌వీణ్‌తో, “నేను నీ ద‌గ్గ‌ర డ‌బ్బులాశించి ప‌డుకోవ‌ట్లేదు.” అని శ్వేత చెప్ప‌డాన్ని బ‌ట్టి ఈ సినిమా క‌థకు శ్వేత పోషించిన పాత్ర కీల‌క‌మ‌నీ, ఆమెను ఇద్ద‌రు యువ‌కులు ఆరాధిస్తార‌నీ తెలుస్తోంది. అలాగే అజ‌య్ క‌తుర్వార్‌కు ఓ యువ‌తితో ల‌వ్ స్టోరీ ఉంద‌నే విష‌యాన్ని కూడా గ‌మ‌నించ‌వ‌చ్చు.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ, బ్యూటిఫుల్ క‌ల‌ర్ టోన్‌తో టీజ‌ర్ రిచ్ లుక్‌తో క‌నిపిస్తోంది. మంచి ప‌ర్ఫార్మెన్స్‌ల‌ను కూడా ఈ సినిమాలో మ‌నం చూడ‌బోతున్నాం. ఓవ‌రాల్‌గా టీజ‌ర్‌ను చూశాక సినిమాను చూడాల‌నే ఇంట్రెస్ట్ క‌లుగుతోందనేది నిజం.స‌మ‌ర్ప‌కుడు కె. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌, ఆస‌క్తి క‌లిగించే క‌థ‌నంతో ఈ చిత్రం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌నీ, త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌నీ చెప్పారు.

- Advertisement -